logo

కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా వైద్యసేవలు

కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా ఆసుపత్రిలో

Published : 22 May 2022 03:10 IST

భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే: కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా ఆసుపత్రిలో విద్యుత్తు సరఫరాకు రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 500 కేవీఏ నియంత్రిక(ట్రాన్స్‌ఫార్మర్‌)ను ప్రారంభించారు. ప్రసూతి వార్డును తనిఖీ చేసి ప్రసూతి చేయించుకున్న మహిళలతో వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి కేసీఆర్‌ కిట్‌ అందిస్తామని, ఆసుపత్రిలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందికి ప్రతి నెల ఒకటో తారీకున వేతనం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డీఎంహెచ్‌వో శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తిరుపతి, విద్యుత్తు శాఖ ఏఈ నితిన్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.  

భూపాలపల్లి టౌన్‌: ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మంజూర్‌నగర్‌లోని మినీ ట్యాంక్‌ బండ్‌ను సందర్శించారు. సౌర విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని, పచ్చదనం పెంచాలని కలెక్టర్‌ను కోరారు. మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ వెంకటరాణి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సంపత్, తెరాస పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్‌ ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని