logo

ప్రగతి నివేదికలు సమర్పించాలి

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఆయా శాఖల ప్రగతి నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ కృష్ణఆదిత్య ఆదేశించారు.

Published : 22 May 2022 03:10 IST

ములుగు, న్యూస్‌టుడే: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఆయా శాఖల ప్రగతి నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ కృష్ణఆదిత్య ఆదేశించారు. జూన్‌ 2న జరగనున్న వేడుకల గురించి శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో నివేదికలు అందించాలన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించి అనుమతి లేని వెంచర్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల వివరాలు అందించాలని సూచించారు. వాటి సామర్థ్య వివరాలు తెలిసేలా చెరువుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. చుంచుపల్లి ప్రాంతంలో చేపపిల్లల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కొత్త సొసైటీలు ఏర్పాటు చేస్తే ముందస్తు సమాచారం ఉండాలన్నారు. మినీ డెయిరీ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న సంక్షేమ వసతి గృహాల నివేదికలు సమర్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ వైవి.గణేష్, డీఆర్‌వో రమాదేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ఇసుక తవ్వకాలపై తనిఖీలు  

ములుగు: జిల్లాలో ఇసుక తవ్వకాలపై ముమ్మర తనిఖీలు చేయాలని కలెక్టర్‌ కృష్ణఆదిత్య ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓవర్‌ లోడింగ్‌ చేసే ఇసుక క్వారీలు, పట్టాదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వెంకటాపురం మండలం కొండాపురంలో పట్టా భూముల్లో ఇసుక అనుమతులపై గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక క్వారీల కోసం వచ్చిన కొత్త దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. తనిఖీ చేసిన ప్రదేశాల నివేదికలను కమిటీకి త్వరగా అందించాలని భూగర్భ జలశాఖ, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ వైవి.గణేష్, డీఆర్‌వో రమాదేవి, టీఎస్‌ఎండీసీ పీవో ఎల్లయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని