logo

స్వల్ప ఉపశమనం!!

కొన్నాళ్లుగా ఇంధన ధరలు ప్రజలకు చుక్కలు చూపెట్టాయి. సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేశాయి. ఆర్థిక భారాన్ని మోపాయి.

Published : 23 May 2022 04:08 IST

దిగొచ్చిన ఇంధన ధరలు..

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: కొన్నాళ్లుగా ఇంధన ధరలు ప్రజలకు చుక్కలు చూపెట్టాయి. సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేశాయి. ఆర్థిక భారాన్ని మోపాయి. ఈ క్రమంలో కేంద్రం పెట్రోల్‌పై రూ.8 డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. శనివారం అర్ధరాత్రి నుంచే తగ్గించిన ధరలు అమలతున్నాయి.వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగినట్లైంది. ద్విచక్ర వాహనదారులతో పాటు, ఆటోలు, ఇతర టాక్సీలు, వ్యాన్లు, లారీల నిర్వాహకులపై భారం తగ్గనుంది. ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌ లబ్ధిదారులకు రూ. 200 రాయితీ ప్రకటించింది. ప్రస్తుతం రూ.40 ఇచ్చేవారు. ఇక నుంచి రూ. 200 ఇస్తారు.

ఆర్టీసీకి రూ.6.13 లక్షలు ఆదా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్‌, 1, 2, హనుమకొండ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, తొర్రూరు, మహబూబాబాద్‌, జనగామ ఆర్టీసీీ డిపోలున్నాయి. ఆయా డిపోల్లో 980 బస్సులు ఉన్నాయి. రోజుకు 80 వేల లీటర్ల డీజిల్‌ వినియోగమవుతుంది. ఈ లెక్కన రోజుకు రూ. 84.32 లక్షలు ఖర్చు అయ్యేది. లీటర్‌కు రూ.7.67 తగ్గడంతో ఆర్టీసీకి ోజుకు రూ. 6.13 లక్షలు ఆదా అవుతుంది.

* ఉమ్మడి జిల్లాలో 364 పెట్రోలు బంకులున్నాయి. నిత్యం సుమారు 18.20 లక్షల లీటర్ల డీజిల్‌, 7.20 లక్షల లీటర్ల పెట్రోల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం డీజిల్‌ ద్వారా రూ. 19.18 కోట్లు, పెట్రోల్‌ ద్వారా రూ. 8.59 కోట్ల వ్యాపారం జరుగుతోంది. తగ్గిన ధరల ప్రకారం డీజిల్‌ వినియోగదారులకు రోజుకు రూ.1.39 కోట్లు, పెట్రోల్‌ వినియోగదారులకు రూ. 70.77 లక్షలు ఆదా కానుంది.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి : - మహేందర్‌, గోపాలపురం, చిట్యాల మండలం

పెట్రోల్‌ ధర తగ్గడం కాస్త ఊరట కలిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని మరింత తగ్గిస్తే వాహనదారులకు మరింత మేలు కలుగుతుంది. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ ఆలోచన చేయాలి.

ఇంకా తగ్గించాలి : - రామన్న, లారీ యజమాని, భూపాలపల్లి

కరోనా నుంచి కోలుకోలేక పోతున్నాం. డీజిల్‌ ధరలు పెరగడంతో వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. లారీలు అమ్ముకన్నాం. డీజిల్‌ ధరలు పెరగడంతో మిగతా అన్నింటివి రేట్లు పెరిగాయి. ఇప్పుడు డీజిల్‌ ధరలు తగ్గాయి కాని, పెద్దగా లాభం లేదు. మునుపటిలా రూ. 70-75 వరకు ఉంటే రోడ్డుపై లారీలు తిరిగుతాయి. మరింత తగ్గించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని