logo

భక్తులారా.. బాసరకు వెళ్తారా!

కాజీపేట నుంచి నిజామాబాద్‌, బాసర వెళ్లాలనే ప్రయాణికుల కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. కాజీపేట జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌, లింగంపేట్‌, జగిత్యాల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, నిజామాబాద్‌, బాసర, ధర్మాబాద్‌ మీదుగా దాదర్‌ (ముంబయి) వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది.

Published : 23 May 2022 04:08 IST

కాజీపేట, న్యూస్‌టుడే: కాజీపేట నుంచి నిజామాబాద్‌, బాసర వెళ్లాలనే ప్రయాణికుల కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. కాజీపేట జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌, లింగంపేట్‌, జగిత్యాల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, నిజామాబాద్‌, బాసర, ధర్మాబాద్‌ మీదుగా దాదర్‌ (ముంబయి) వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ముందుగా వీటిని ప్రత్యేక రైళ్లుగా పేర్కొని తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి శాశ్వత రైళ్లుగా ప్రకటించనుంది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని 22 ప్రత్యేక రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. 07195 నెంబర్‌ గల ప్రత్యేక రైలు కాజీపేట జంక్షన్‌ నుంచి 17.00 గంటలకు బయలుదేరి కరీంనగర్‌కు 19.03, నిజమాబాద్‌కు 22.50, బాసరకు 23.30, దాదర్‌కు 13.25 గంటలకు చేరుకుంటుంది. ఇదే రైలు బుధవారం అంటే మే 25, జూన్‌ 1, 8, 22, 29వ తేదీల్లోనూ అందుబాటులో ఉంటుంది. 07196 నెంబర్‌తో తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం అంటే మే 26, జూన్‌ 2, 9, 16, 23, 30వ తేదీల్లో దాదర్‌లో 21.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 20.00 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు బాసరలో 12.15 గంటలకు, నిజామాబాద్‌లో 13.15 గంటలకు ఆగుతుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి బాసర సరస్వతీ క్షేత్రానికి వెళ్లాలనుకునే వారికి ఈ రెండు రైళ్లు మంచి సౌకర్యంగా చెప్పుకోవచ్ఛు అంతేగాకుండా జగిత్యాల, మెట్‌పల్లి, ఆర్మూర్‌ వాసులకు కూడా వరంగల్‌కు వచ్చేందుకు రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.

బల్లార్షా, ఆదిలాబాద్‌ మీదుగా..: మరో మార్గంలో కాజీపేట నుంచి దాదర్‌కు బల్లార్షా, ఆదిలాబాద్‌ మీదుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. 07197 నెంబరుతో కాజీపేట-దాదర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రతి శనివారం అంటే మే 28, జూన్‌ 4, 11, 18, 25వ తేదీల్లో కాజీపేట జంక్షన్‌లో 11.30 గంటలకు బయలుదేరుతుంది. 07198 నెంబర్‌ గల ప్రత్యేక రైలు దాదర్‌-కాజీపేట మధ్య నడుస్తుంది. ఈ రైలు ప్రతి ఆదివారం అంటే మే 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు కాజీపేటలో అందుబాటులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని