logo

వర్సిటీలో రూ.45 కోట్లతో అభివృద్ధి

తన ఏడాది పాలనా కాలంలో అందరి సహకారంతో కాకతీయ విశ్వవిద్యాలయాలన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానని ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్‌ అన్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సెనెట్‌హాల్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘

Published : 24 May 2022 04:01 IST

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: తన ఏడాది పాలనా కాలంలో అందరి సహకారంతో కాకతీయ విశ్వవిద్యాలయాలన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానని ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్‌ అన్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సెనెట్‌హాల్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘గతంలో లేని విధంగా రూ.27 కోట్లను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్‌ గ్రాంటు కింద తీసుకువచ్చాం. నాలుగేళ్లుగా నిలచిపోయిన పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాం. బోధనేతర సిబ్బందికి పదోన్నతులు కల్పించాం. 49 మంది అధ్యాపకులకు సహా ఆచార్యులుగా, ఆచార్యులుగా పదోన్నతి లభించింది. ఈ ఏడాది జులై స్నాతకోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. రూ.45 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. పోటీపరీక్షార్థులకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పరిశోధనా, సదస్సుల నిర్వహణకు పీవీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మహిళా వసతి గృహాలను నిర్మించడంతో పాటు మహిళా అధ్యాపకులకు కీలకమైన పదవులను అప్పగించాం. కొవిడ్‌ కాలంలో బోధనకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాం. వర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మిస్తాం. బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీకి నా వంతు కృషి చేస్తా. అంతర్‌ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీలను నిర్వహిస్తా’మన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకట్రాంరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య మల్లారెడ్డి, దూరవిద్యాకేంద్రం సంచాలకులు ఆచార్య శ్రీనివాసరావు, అభివృద్ధి అధికారి ఆచార్య రామచంద్రం, సీడీసీ డీన్‌ ఆచార్య డేవిడ్‌, అధికారులు పాల్గొన్నారు. అనంతరం పాలకమండలి సభ్యులకు సాధించిన అభివృద్ధిని వివరించగా వారు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని