logo

నీళ్లు పోసి.. కంచె ఏర్పాటు..

లక్ష్మీపూర్‌తండ పల్లె ప్రకృతి అధ్వానంగా మారింది. ఎవరూ పట్టించుకోకవపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ విషయమై ఈనెల 23న ‘ఈనాడు’లో ‘నమ్మడి.. ఇది పల్లె ప్రకృతి వనమే’ అనే శీర్షిక చిత్ర కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు.

Published : 24 May 2022 04:17 IST

 


ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

చిట్యాల, న్యూస్‌టుడే: లక్ష్మీపూర్‌తండ పల్లె ప్రకృతి అధ్వానంగా మారింది. ఎవరూ పట్టించుకోకవపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ విషయమై ఈనెల 23న ‘ఈనాడు’లో ‘నమ్మడి.. ఇది పల్లె ప్రకృతి వనమే’ అనే శీర్షిక చిత్ర కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. ఎంపీడీవో రామయ్య గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి వచ్చారు. ఎండిపోతున్న మొక్కలకు నీళ్లు పోయించారు. ఉద్యాన వనం చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయించారు. పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. మొక్కల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచి జవహర్‌ను సూచించారు. ఆయన వెంట ఎంపీవో రామకృష్ణ, ఈజీఎస్‌ ఏపీవో అలీమ్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రకృతి వనంపై కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఆరా తీశారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని