logo

రామప్పను సందర్శించిన ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి

వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయాన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత జడ్జి జి.యతిరాజులు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు

Published : 24 May 2022 04:17 IST

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయాన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత జడ్జి జి.యతిరాజులు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యతిరాజులు,  కుటుంబ సభ్యులు రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆయనను శాలువాలతో సన్మానించి ఆశీర్వదించారు. పర్యాటక గైడ్‌లు ఆలయ చరిత్రను వారికి వివరించారు. అనంతరం ఆలయంపై శిల్పకళా సౌందర్యాన్ని వారు తిలకించారు. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు దిగి వెళ్లిపోయారు. వారి వెంట ములుగు జడ్జి రామచందర్‌రావు, మొబైల్‌కోర్టు జడ్జి సౌఖ్య, ములుగు సీఐ శ్రీధర్‌, వెంకటాపూర్‌ ఎస్‌ఐ రాధిక తదితరులు ఉన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని