logo

గిరిజనులకు అందుబాటులో వైద్యసౌకర్యం

గిరిజన ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అప్పయ్య అన్నారు. ములుగులోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆయుష్మాన్‌ భారత్‌పై నిర్వహించిన అవగాహన సమావేశంలో

Published : 24 May 2022 04:17 IST

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో అప్పయ్య

ములుగు, న్యూస్‌టుడే: గిరిజన ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అప్పయ్య అన్నారు. ములుగులోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆయుష్మాన్‌ భారత్‌పై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యాధికారుల ద్వారా గిరిజనులకు అన్ని రకాల సేవలు, చికిత్సలను స్థానికంగానే అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌లో 1672 రకాల చికిత్సలు ఉన్నాయని,  అందులో 442 చికిత్సలు ప్రభుత్వ వైద్యశాల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో  అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 53 రకాల చికిత్సలు అందిస్తారన్నారు. పాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగి వద్ద ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే తహసీల్దారు నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే ఆరోగ్యశ్రీ చికిత్స అందిస్తారని తెలిపారు. ఆరోగ్య సర్వేలో మిగిలిన వారిని గుర్తించి వివరాలు సేకరించాలని సూచించారు. నిర్దేశించిన నమూనాలో నమోదు చేసి రెండు రోజుల్లో అందించాలని ఆదేశించారు. జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అభిలాష్‌, టీం లీడర్‌ సుమన్‌, ప్రోగ్రాం అధికారులు వెంకటేశ్వర్లు, వైద్యులు మృదుల, నరేష్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని