logo

జాతర పనులు..అంతలోనే పగుళ్లు

వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో చేపట్టిన నిర్మాణాలు, భవనాలు మూడు నెలల ముచ్చటగా మారుతున్నాయి. ఫిబ్రవరిలో జాతర వైభవంగా జరిగింది. ఏర్పాట్లు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించింది.

Published : 24 May 2022 04:22 IST

- ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే, తాడ్వాయి

వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో చేపట్టిన నిర్మాణాలు, భవనాలు మూడు నెలల ముచ్చటగా మారుతున్నాయి. ఫిబ్రవరిలో జాతర వైభవంగా జరిగింది. ఏర్పాట్లు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించింది. అభివృద్ధి పనులు, ఏర్పాట్లను హడావుడిగా చేపట్టారు. జాతరకు వారం రోజుల ముందు వరకూ పనులు జరిగాయి. త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు, గుత్తేదారులు నాణ్యతపై దృష్టి సారించలేదు. దీంతో ఇప్పుడు పలు నిర్మాణాలు పగుళ్లు బారాయి. కొన్నిచోట్ల అస్తవ్యస్థంగా కనిపిస్తున్నాయి. దీనికి నిర్వహణ లోపం కూడా తోడైంది.
* జాతర పరిసరాల్లో నిర్మించిన కట్టడాలకు రక్షణ లేకుండా పోయింది. నిర్మాణాల్లోని సామగ్రి చోరీకి గురవుతోంది. టైల్స్‌, ఎలక్ట్రిసిటీ, తలుపులు, తదితర వస్తువులను దుండగులు ఎత్తుకెళ్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆయా శాఖలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది.
హెలిప్యాడ్‌ సమీపంలో రూ.35 లక్షలతో నిర్మించిన సులభ్‌ కాంప్లెక్స్‌ ఇది. జాతర ముగిసిన మూడు నెలల వ్యవధిలోనే ఇలా తయారైంది. మెట్లకున్న టైల్స్‌ ధ్వంసం అయ్యాయి. లోపలిభాగంలో తలుపులు, సింకులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని