logo

రుణాల పేరుతో మోసం.. ముఠా అరెస్టు

బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్‌క్రైం, ఐనవోలు పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గురువారం కమిషనరేట్‌లో సీపీ తరుణ్‌జోషి నిందితుల వివరాలను వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అజంఘడ్‌కు చెందిన  

Updated : 27 May 2022 05:11 IST

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్‌క్రైం, ఐనవోలు పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గురువారం కమిషనరేట్‌లో సీపీ తరుణ్‌జోషి నిందితుల వివరాలను వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అజంఘడ్‌కు చెందిన  మనోజ్‌ సైస్వాల్‌, జ్ఞానేంద్ర యాదవ్‌, బిహార్‌కు చెందిన రాజ్‌కుమార్‌లు ముఠాగా ఏర్పడి రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీరిని అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.07 లక్షల నగదును నాలుగు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియా బుల్స్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించారు. పున్నెలు గ్రామానికి చెందిన బొంత రవీందర్‌ ఇది అసలైన వెబ్‌సైట్‌ అనుకొని రుణం కోసం ప్రయత్నించాడు. వెంటనే ఇండియా బుల్‌ మేనేజర్‌ పేరుతో వ్యక్తి పరిచయం చేసుకొని రుణం కోసం రూ.1.36 లక్షల ఆన్‌లైన్‌ ద్వారా ఇతర ఖాతాల్లోకి మళ్లించాడు. ఎన్నిరోజులు గడిచినా రుణం రాకపోవడంతో ఐనవోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఐనవోలు ఎస్సై భరత్‌ ప్రత్యేక పోలీసు బృందంతో బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లి నిందితులను పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకొని అక్కడి కోర్టులో హాజరుపర్చి వరంగల్‌ పోలీసు కమిషరేట్‌కు తీసుకొని వచ్చారు. సైబర్‌ నేరాలకు పాల్పడేందుకుగాను నిందితులు ఉపయోగించే సెల్‌నెంబర్లు, బ్యాంక్‌ ఖాతాలు, యూపీసీ వివరాలపై పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్‌ విచారణ అనంతరం నిందితులను వరంగల్‌ కోర్టులో హాజరుపర్చారు. నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కబనర్చిన ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూర్‌ ఏసీపీ నరేష్‌కుమార్‌, పర్వతగిని సీఐ విశ్వేశ్వర్‌, ఐనవోలు ఎస్సై భరత్‌, ఏఏవో సల్మాన్‌పాషా, ఏఎస్సై శర్మ, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, అన్వర్‌, రాకేశ్‌తో పాటు పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.
 

వివరాలు వెల్లడిస్తున్న సీపీ తరుణ్‌జోషి, చిత్రంలో డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ నరేశ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌, పోలీసు సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని