logo

రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిద్దాం

పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో దళితులను మోసం చేస్తున్న కేసీఆర్‌ పాలనకు చమరగీతం పాడి రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిద్దామని రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌

Updated : 28 May 2022 04:03 IST

కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్‌దాస్‌ అథావాలేను గజమాలతో సత్కరిస్తున్న ఆర్‌పీఐ నాయకులు

ఎన్జీవోస్‌కాలనీ, నిట్‌ క్యాంపస్‌ న్యూస్‌టుడే: పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో దళితులను మోసం చేస్తున్న కేసీఆర్‌ పాలనకు చమరగీతం పాడి రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిద్దామని రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్‌ అథావాలే అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఓరుగల్లుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వర్కిగ్‌ ప్రెసిడెంట్‌ పసుల రవికుమార్‌ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల జాతికే స్వాతంత్య్రం వచ్చిందని, ఇప్పటికి దళితులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ పార్టీకి రాష్ట్రంలో పది నుంచి పదిహేను స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు బ్రహ్మనందరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని అవమానించడం సరికాదన్నారు. తొలుత కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్నేహలత, ప్రధాన కార్యదర్శి జ్యోతిరమణ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

అందరి సంక్షేమం కోసమే కేంద్ర పథకాలు..

నిట్‌ క్యాంపస్‌, నదేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలె పేర్కొన్నారు. తొలుత నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకోగా హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపి, సీపీ డాక్టర్‌ తరుణ్‌ జోషి, అధికారులు స్వాగతం పలికారు. నిట్‌ కళాశాలలో ప్రభుత్వ శాఖల అధికారులతో కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల్‌, ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, తదితర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పక్కాగా పథకాలు అందేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్‌, శ్రీవత్స అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని