logo

మండలంలో బీఎస్పీ యాత్ర

బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించిన బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం కేసముద్రం మండలం చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 300రోజుల పాటు

Updated : 28 May 2022 04:00 IST

కేసముద్రంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌

కేసముద్రం, న్యూస్‌టుడే: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించిన బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం కేసముద్రం మండలం చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 300రోజుల పాటు నిర్వహించనున్న ఈ యాత్ర 75వ రోజు మండలానికి చేరుకుంది. ఉదయం 9 గంటలకు నారాయణపురం గ్రామంలో ప్రారంభించిన ఈ యాత్ర నెల్లికుదురు మండలం చెట్లముప్పారం మీదుగా ఇనుగుర్తి గ్రామానికి చేరుకుంది. నిరుపేదలు, కార్మికులు, రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు మార్కెట్‌ యార్డును సందర్శించారు. మధ్యాహ్నం అమీనాపురంలో భోజనం చేసిన అనంతరం సాయంత్రం కాట్రపల్లి, బేరువాడ గ్రామాల్లో యాత్ర కొనసాగించారు. శనివారం గూడూరు మండలంలో యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇనుగుర్తి మండలం ఏర్పాటు చేయడంతోపాటు, నారాయణపురం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బహుజను బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ జిల్లా నేతలు విజయ్‌కాంత్‌, లక్ష్మణ్‌, రమేశ్‌, బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని