logo

నమోదుకు.. గడువు మూడు రోజులే..!

వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకూ లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని అమలు చేస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు కుటుంబంలో

Updated : 28 May 2022 03:56 IST

అవగాహన కల్పిస్తున్న అధికారులు

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకూ లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని అమలు చేస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు కుటుంబంలో పట్టాదారు పాసుపుస్తకం కల్గిన ప్రతి ఒక్కరికీ ఏడాదిలో రూ.6 వేలు (మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున) అందజేస్తోంది. ఈనెల 31లోగా ఈకేవైసీని నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మండల వ్యవసాయాధికారులు, ఏఈవోలు ఆయా క్లస్టర్ల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. మరో మూడు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ నమోదు చేసుకొని వారెవరైనా ఉంటే మేల్కోవాలని సూచిస్తున్నారు.

ఇప్పటికీ 32 శాతమే..

జిల్లాలో మొత్తం అర్హత కల్గిన రైతులు 90,353 మంది ఉన్నారు. ప్రస్తుతం వరకు 29,352 మంది రైతులు మాత్రమే ఈకేవైసీని పూర్తి చేశారు. అవగాహన లేక కొందరు, ఉన్న వారు ‘చేద్దాం.. చూద్దాం’ అంటూ కాలయాపన చేశారు. వరి కోతలు, పంటల దిగుబడులు చేతికొచ్చిన వేళ ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పనుల్లో నిమగ్నం కావడం కూడా ఒక కారణం.

విస్తృత ప్రచారం.. - వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జనగామ

రైతులందరూ ఈకేవైౖసీని నమోదు చేసుకోవాలని కొన్ని నెలలుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు జనగామ మండలం పెద్దరాంచర్ల గ్రామాన్ని సందర్శించి అక్కడి రైతుల ద్వారా తెలుసుకున్నాం. ఈనెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పెద్దరాంచర్లలో నలుగురు చురుకైన యువకులను ఎంపిక చేసి వారి ద్వారా ఈకేవైసీని పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇదే తరహాలో మిగిలిన గ్రామాల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం.

పథకం: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి

విడత : 11వ విడత

అర్హులైన రైతుల సంఖ్య: 90,353

ప్రస్తుతం నమోదైన సంఖ్య: 29,352

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని