logo

బహుజన శక్తిదే రాజ్యాధికారం

ఒకప్పుడు పాలకులను ప్రశ్నించాం.. ఇప్పుడు మాకు మేమే ప్రశ్నించుకుంటాం.. ఆత్మ విమర్శ చేసుకుంటామని ప్రజాకవి గద్దర్‌ పేర్కొన్నారు. సుబేదారిలోని ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన బహుజన ధూందాం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు ఎవరైతే ఉద్యమిస్తారో వారే చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. 85 శాతం జనాభా కలిగిన బహుజన శక్తి తప్పనిసరిగా రాజ్యాధికారం సాధిస్తుందన్నారు. ‘బానిసలారా లేండి..

Published : 29 May 2022 03:48 IST


ప్రజాకవి గద్దర్‌ ఆటా, పాట

వరంగల్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఒకప్పుడు పాలకులను ప్రశ్నించాం.. ఇప్పుడు మాకు మేమే ప్రశ్నించుకుంటాం.. ఆత్మ విమర్శ చేసుకుంటామని ప్రజాకవి గద్దర్‌ పేర్కొన్నారు. సుబేదారిలోని ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన బహుజన ధూందాం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు ఎవరైతే ఉద్యమిస్తారో వారే చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. 85 శాతం జనాభా కలిగిన బహుజన శక్తి తప్పనిసరిగా రాజ్యాధికారం సాధిస్తుందన్నారు. ‘బానిసలారా లేండి.. ఈ బాంచన్‌ బతుకులు వద్దురా’ అనే పాటతో చైతన్యం నింపారు. వాగ్గేయకారుడు మాస్టర్‌జీ, వరంగల్‌ శ్రీనివాస్‌, తెలంగాణ శ్యామ్‌, గుడిపెల్లి రవి తదితరులు ఆటపాటలతో బహుజన నినాదం నింపారు. సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన చిన్నారి రాశి ‘మార్చలేదు మన బతుకులు’ అనే పాట ఆలోచింపజేసింది. ధూందాం రాష్ట్ర కన్వీనర్‌ మచ్చ దేవేందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత విశ్రాంతాచార్యులు కూరపాటి వెంకటనారాయణ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ద్రవిడ బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జిలుకర శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, బీసీ స్టడీ ఫోరం రాష్ట్ర ఛైర్మన్‌ సాయిని నరేందర్‌, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌, మాజీ బీసీీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్‌.రాములు, తాడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్‌, అమ్మఒడి సుభద్ర, శ్రీనివాస్‌ తదితరులున్నారు.


పాల్గొన్న బహుజనులు, ప్రముఖులు

బహుజన ధూందాంలో అభివాదం చేస్తున్న నేతలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని