logo

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

వ్యవసాయం కోసం తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై రామారావు, గ్రామస్థుల కథనం ప్రకారం.. నల్లబెల్లి గ్రామానికి చెందిన తక్కలపెల్లి రాజేశ్వర్‌రావు(35) తనకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు.

Published : 29 May 2022 03:48 IST


టి.రాజేశ్వర్‌రావు

వర్ధన్నపేట రూరల్‌, న్యూస్‌టుడే: వ్యవసాయం కోసం తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై రామారావు, గ్రామస్థుల కథనం ప్రకారం.. నల్లబెల్లి గ్రామానికి చెందిన తక్కలపెల్లి రాజేశ్వర్‌రావు(35) తనకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా దిగుబడి రాక అప్పులు కట్టలేని పరిస్థితి నెలకొంది. మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వ్యాపారంలో నష్టపోయి యువకుడు..

భీమారం, న్యూస్‌టుడే: అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హనుమకొండ మండలం గుండ్లసింగారంలో చోటుచేసుకుంది. కేయూ ఎస్సై రాజ్‌కుమార్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట గ్రామానికి చెందిన మూడు భాస్కర్‌(35) గుండ్లసింగారంలోని గణేశ్‌నగర్‌ కాలనీలో కొంత కాలంగా భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నారు. వ్యాపారంలో నష్టపోయి అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం అర్ధరాతి ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని