logo

తీన్మార్‌ మల్లన్న అరెస్టుతో ఉద్రిక్తత

ల్యాండ్‌ పూలింగ్‌ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ వరంగల్‌ జిల్లా వరంగల్‌ మండలం ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Published : 29 May 2022 08:34 IST


వరంగల్‌ మండలం ఆరెపల్లిలోని పోచమ్మ ఆలయంలో జరిగిన రైతు
ఐక్య కార్యాచరణసమితి సమావేశంలో మాట్లాడుతున్న తీన్మార్‌ మల్లన్న

భీమారం, న్యూస్‌టుడే: ల్యాండ్‌ పూలింగ్‌ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ వరంగల్‌ జిల్లా వరంగల్‌ మండలం ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆరెపల్లిలోని పోచమ్మ ఆలయంలో బాధిత రైతులు సమావేశమయ్యారు. తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) సమావేశానికి హాజరై వారికి మద్దతు తెలిపారు. ఆయన ప్రసంగిస్తుండగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఆలయ ప్రాంగణంలోకి వెళ్లి అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా రైతులు, మహిళలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. బూట్లు వేసుకుని ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మల్లన్నను పోలీసులు బలవంతంగా లాక్కోని వెళ్లి వేలేరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సమావేశంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్‌ బుద్దె పెద్దన్న, సభ్యులు బుద్దె ఈశ్వర్‌, వంశీ, బాబురావు, బోయిని ఐలయ్య, బుద్దె సమ్మయ్య, కమలాపురం రాజేశ్వర్‌రావు, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు