logo

కాజీపేట నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు

ఏడుకొండల వేెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ వారానికి అయిదు రోజులు మాత్రమే నడుస్తుండటంతో ఇబ్బంది కలుగుతోంది.

Updated : 29 May 2022 04:26 IST

కాజీపేట, డోర్నకల్‌, న్యూస్‌టుడే: ఏడుకొండల వేెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ వారానికి అయిదు రోజులు మాత్రమే నడుస్తుండటంతో ఇబ్బంది కలుగుతోంది. పైగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి వెళ్లేవారికి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో బెర్తులు దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాజీపేట రైల్వే స్టేషన్‌ నుంచే రైలు ప్రారంభిస్తుండటంతో ఇక్కడి భక్తులకు సులువుగా బెర్తులు లభించే అవకాశం ఉంది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కాజీపేట జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తిరుపతికి పది ప్రత్యేక రైళ్లు నడుపనుంది.

* 07091 నెంబరుతో ప్రతి మంగళవారం అంటే మే 31, జూన్‌ 7, 14, 21, 28వ తేదీల్లో ఉదయం 11 గంటలకు బయలుదేరి తిరుపతికి అదే రోజు రాత్రి 10.20 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్‌కు 11.14, కేసముద్రంకు 11.58, మహబూబాబాద్‌కు మధ్యాహ్నం 12.20, డోర్నకల్‌కు 12.42 గంటలకు వచ్చి తిరుపతికి రాత్రి 10.20 గంటలకు చేరుకుంటుంది.

* అలాగే 07092 నెంబరుతో తిరుపతిలో ప్రతి మంగళవారం రాత్రి 11.40 గంటలకు బయలుదేరి డోర్నకల్‌కు ఉదయం 07.55, మహబూబాబాద్‌కు 08.15, కేసముద్రంకు 08.45, వరంగల్‌ 09.48, కాజీపేటకు 10.45 గంటలకు చేరుకుంటుంది. కాజీపేట పిట్‌లైన్‌లో ప్రత్యేక రైలు కోచ్‌లను నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు స్టేషన్లతో పాటు ఈ రైలు ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌ల్లో ఆగుతుంది. నాలుగు జనరల్‌ బోగీలు, ఏడు స్లీపర్‌ క్లాస్‌, నాలుగు ఏసీ బోగీలుంటాయని కాజీపేట రైల్వే వర్గాలు తెలిపాయి.

* ఇక రెండోది సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రతి శనివారం, తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య ఆదివారం నడుస్తుంది. జూన్‌ 4, 11, 18, 25వ తేదీల్లో రైలు నెంబరు 02764 సికింద్రాబాద్‌లో సాయంత్రం 06.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూన్‌ 5, 12, 19, 26వ తేదీల్లో రైలు నెంబరు 02763 తిరుపతిలో సాయంత్రం 5 గంటలకు బయల్దేరి మరుసటి రోజు వేకువజామున 5.45 గంటలకు సికింద్రాబాద్‌ వెళుతుంది. దీనికి జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని