logo

పాఠశాలల పనుల్లో జాప్యం చేయొద్దు

మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టే పనుల్లో జాప్యం చేయొద్దని కలెక్టర్‌ కృష్ణఆదిత్య అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలంలో నాలుగు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.

Published : 29 May 2022 03:56 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ కృష్ణఆదిత్య

ములుగు, న్యూస్‌టుడే: మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టే పనుల్లో జాప్యం చేయొద్దని కలెక్టర్‌ కృష్ణఆదిత్య అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలంలో నాలుగు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. నిర్మాణ పనులకు అవసరమైన సిమెంటు, ఇసుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో మొదటి దశలో 125 పాఠశాలను ఎంపిక చేయగా ఇప్పటి వరకు 83 పాఠశాలలకు పరిపాలన అనుమతులు, 81 బడులకు సాంకేతిక అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.26 కోట్ల అంచనాలతో పనులు చేపట్టడానికి ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారని స్పష్టం చేశారు. మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అభివృద్ధి పనులు జూన్‌ 16 నాటికి పూర్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్‌డీవో వెంకటనారయణ, డీఈవో పాణిని, పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, ఈడీఎం దేవేందర్‌, ఈడబ్ల్యూఐడీసీ, గిరిజన సంక్షేమశాఖల డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

గోడపత్రికల ఆవిష్కరణ

ములుగు: అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని యునిసెఫ్‌ రూపొందించిన గోడపత్రికలను శనివారం కలెక్టర్‌ కృష్ణఆదిత్య కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ప్రతి కిశోర బాలిక, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుందన్నారు. జిల్లా వ్యక్తిగత పరిశుభ్రతలో కూడా ఆదర్శంగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్‌వో రమాదేవి, డీఆర్‌డీవో వెంకటనారాయణ, ఎస్బీఎం కో-ఆర్డినేటర్‌ మైమున్నీసా, డీపీఎంలు గోవింద్‌ చౌహాన్‌, విజయ భారతి, ఐఈసీ జిల్లా కో-ఆర్డినేటర్‌ షర్ఫున్నిసా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని