logo

Konda: సందడిగా ‘కొండా’ ప్రీ రిలీజ్‌ వేడుక

కొండా సురేఖ, మురళీధర్‌రావు దంపతుల జీవితగాథపై రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘కొండా’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను శనివారం రాత్రి హనుమకొండలోని విష్ణుప్రియ వేడుకల మందిరంలో సందడిగా

Updated : 19 Jun 2022 07:22 IST

మాట్లాడుతున్న కొండా మురళీధర్‌రావు వేదికపై కొండా సురేఖ, చిత్ర బృందం

న్యూశాయంపేట, న్యూస్‌టుడే: కొండా సురేఖ, మురళీధర్‌రావు దంపతుల జీవితగాథపై రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘కొండా’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను శనివారం రాత్రి హనుమకొండలోని విష్ణుప్రియ వేడుకల మందిరంలో సందడిగా నిర్వహించారు. వ్యాఖ్యాత సుమ సినీ నటులను పరిచయం చేస్తూ సినిమా ఇతివృత్తాన్ని వివరించారు. వరంగల్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసిన ఈ సినిమాను ఈనెల 23న విడుదల చేయనున్నారు.  
రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ కొండా దంపతుల జీవితాలపై వారి కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ నిర్మించిన ఈ సినిమాకు న్యాయం చేశానని చెప్పారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న సినిమాను ప్రజలు ఆదరించి తిరిగి విజయోత్సవ సభను వరంగల్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సినిమాలో నటించిన కమెడియన్‌ రాంప్రసాద్‌, పార్వతిని పరిచయం చేశారు.  హీరో త్రిగున్‌, హీరోయిన్‌ ఇరామోర్‌లు వేదికపైకి రావడంలో సభికులు ఈలలు వేశారు. త్రిగున్‌ మాట్లాడుతూ తన తండ్రి వరంగల్‌లో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారని.. వరంగల్‌ ప్రజల ఆదరాభిమానాలు ఉండాలని ఆకాంక్షించారు. ఆర్‌జీవీతో సినిమా చేయాలనే తన ఆశ తీరనుందన్నారు.  హీరోయిన్‌ ఇరామోర్‌ లాల్‌ సలాం సురేఖమ్మా అంటూ నినదించారు. నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా గీతానికి వేదికపై రాంగోపాల్‌వర్మ తుపాకి పట్టుకొని నటులతో నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. తొలుత కొండా మురళీధర్‌రావు తల్లిదండ్రులు కొండా చెన్నమ్మ, కొమురయ్య దంపతుల చిత్రపటానికి కొండా దంపతులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రశాంత్‌, కొరియోగ్రాఫర్‌ సుచిత్ర, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని