logo

వాన నీరు ఇంకే సరికొత్త రహదారులు

 వర్షాలు బాగా కురిస్తే మట్టి రోడ్లపై నిలిచిన నీరు భూమిలోకి ఇంకినట్టు.. తారు, సిమెంటు రోడ్లపై ఇంకదు. రహదారులపై గుంతలు ఉంటే నీళ్లు వారాలపాటు అలాగే నిలిచిపోతాయి. ఈ సమస్యకు వరంగల్‌ ఎన్‌ఐటీ సివిల్‌ ఇంజినీరింగ్‌

Updated : 26 Jun 2022 05:23 IST

అభివృద్ధి చేసిన ఎన్‌ఐటీ  విద్యార్థి


పోరస్‌ విధానంలో రూపొందించిన తారు రోడ్డు నమూనా

ఈనాడు, వరంగల్‌:  వర్షాలు బాగా కురిస్తే మట్టి రోడ్లపై నిలిచిన నీరు భూమిలోకి ఇంకినట్టు.. తారు, సిమెంటు రోడ్లపై ఇంకదు. రహదారులపై గుంతలు ఉంటే నీళ్లు వారాలపాటు అలాగే నిలిచిపోతాయి. ఈ సమస్యకు వరంగల్‌ ఎన్‌ఐటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ పరిశోధక విద్యార్థి గుమ్మడి చిరంజీవి.. ప్రొఫెసర్‌ ఎస్‌.శంకర్‌ మార్గదర్శనంలో ప్రత్యామ్నాయం చూపారు.  పోరస్‌ తారు రహదారిని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో భారీ వర్షాలు కురిసినా వెంటవెంటనే నీరు రహదారి లోపలికి ఇంకుతాయి. లోపలున్న మరికొన్ని పొరల్లో చేరి నిదానంగా పక్కనున్న డ్రైన్లలోకి వెళతాయి.

వర్షం ద్వారా వచ్చే చెత్తా చెదారాన్ని వడకట్టి నీటిని మాత్రమే లోనికి పంపేంత సూక్ష్మ రంధ్రాలతో తారు, సిమెంటును రూపొందించడం ఈ విధానం ప్రత్యేకత. ఎన్‌ఐటీ ప్రయోగశాలలో ఈ విధానంలో నమూనా తయారు చేసి పరీక్షించారు. క్యాంపస్‌లో 50 మీటర్ల మేర ఈ విధానంలో రహదారిని త్వరలో నిర్మిస్తామని ఈ పరిశోధనకు గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్‌ శంకర్‌ తెలిపారు.

తయారీ విధానాన్ని వివరిస్తున్న గుమ్మడి చిరంజీవి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని