logo

ఆర్థిక అవకతవకల్లో నలుగురిపై వేటు?

జనగామ మండలంలోని వెంకిర్యాల పొదుపు సంఘంలో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకల్లో భాగంగా నలుగురు ఉద్యోగులపై వేటు పడినట్లు తెలిసింది.

Published : 28 Jun 2022 06:16 IST

దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: జనగామ మండలంలోని వెంకిర్యాల పొదుపు సంఘంలో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకల్లో భాగంగా నలుగురు ఉద్యోగులపై వేటు పడినట్లు తెలిసింది. 2016 నుంచి 2021 వరకు ఆర్థిక లావాదేవీల్లో తేేడాలు కనిపించడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు దశల వారీగా విచారణ జరిపారు. మళ్లీ ఫిర్యాదులు రావడంతో జిల్లా పాలనాధికారి మరోసారి విచారణ జరిపి ఏపీఎం సత్యనారాయణ, క్లస్టర్‌ సీసీ రఘుకుమార్‌ సహా మరో ఇద్దరు సీసీలు సదానందం, యాదగిరిలను బాధ్యులుగా గుర్తించి సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. అధికారుల ప్రాథమిక విచారణలో సుమారు రూ.98 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని