logo

వడివడిగా మన బడి అభివృద్ధి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం జిల్లాలో అడుగులు వేస్తోంది.

Published : 28 Jun 2022 06:45 IST


వెంకటాపురం నాయకులగూడెంలో పూర్తయిన గది నిర్మాణం

 

ములుగు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం జిల్లాలో అడుగులు వేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం సమకూర్చిన నిధులతో పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులపై కలెక్టర్‌ కృష్ణఆదిత్య ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు పరుగులు పెడుతున్నారు.

మొదటి విడతలో 36 బడులు ఎంపిక

జిల్లాలో మొత్తం 125 పాఠశాలలు ఎంపిక చేశారు. వీటిల్లో మొదటి విడతలో భాగంగా రూ. 30 లక్షల లోపు పనులు చేపట్టాల్సిన 36 పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 9 మండలాలుండగా ఒక్కో మండలం నుంచి నాలుగు పాఠశాలలను ఎంపిక చేసి వాటిని మాడల్‌ పాఠశాలలుగా నామకరణం చేశారు. మొదటి విడతలో ఎంపిక చేసినవన్నీ ప్రాథమిక పాఠశాలలే.


పస్రా నాగారంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యుత్తు మరమ్మతులు

కలెక్టర్‌ అనుమతితో పనులు

ఎంపిక చేసిన పాఠశాలల్లో కలెక్టర్‌ అనుమతితో పనులు చేపడుతున్నారు. నిధుల కేటాయింపు, బిల్లుల చెల్లింపు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కలెక్టర్‌ అనుమతితోనే జరగాల్సి ఉంది. అదే పద్ధతిన ప్రస్తుతం జిల్లాలో పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మండలానికి రెండు మాడల్‌ పాఠశాలలుగా ఎంపిక చేసి పనులు నిర్వహిస్తున్నారు. కాని ములుగు జిల్లాలో కలెక్టర్‌ చొరవతో నాలుగు చొప్పున ఎంపిక చేసి అభివృద్ధి పనులకు అనుమతి ఇచ్చారు.


కన్నాయిగూడెం: లక్ష్మీపురంలో..

ఏయే పనులంటే..

ఎక్కువ శాతం మరమ్మతులే జరుగుతున్నాయి. ఫ్లోరింగ్‌ పునరుద్ధరణ, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు, మరుగుదోడ్లు, శ్లాబు మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని