logo

అగ్నిపథ్‌ రద్దు చేయాల్సిందే!

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అగ్నిపథ్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హనుమకొండ డీసీసీ భవన్‌లో శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరిగింది.

Published : 28 Jun 2022 06:45 IST


హనుమకొండ డీసీసీ భవన్‌లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్‌ నాయకులు

రంగంపేట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అగ్నిపథ్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హనుమకొండ డీసీసీ భవన్‌లో శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరిగింది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న కుట్రలో భాగంగానే దేశ రక్షణలో కీలకంగా పనిచేసే సైనిక ఉద్యోగాలను ప్రైవేటు పరం చేసేందుకు కొత్తగా అగ్నిపథ్‌ అమల్లోకి తెచ్చిందన్నారు. మాజీ ఎంపీ రాజయ్య, మాజీ మేయర్‌ స్వర్ణ మాట్లాడుతూ ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ తోట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకులు సరళాయాదవ్‌, డాక్టర్‌ రామకృష్ణ, విక్రమ్‌, రవీందర్‌, యాకస్వామి, కవిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.


పోచమ్మమైదాన్‌ కూడలిలో..

పోచమ్మమైదాన్‌: సికింద్రాబాద్‌ పోలీసు కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేష్‌ది భాజపా, తెరాస చేసిన హత్య అని మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సోమవారం పోచమ్మమైదాన్‌ కూడలిలో ‘అగ్నిపథ్‌’ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.ఆ ఘటనలో సంబంధం లేని యువకులపై కేసులు పెట్టి జైలుపాలు చేశారని, వారిని విడుదల చేసి కేసులను ఉపసంహరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం డివిజన్‌ అధ్యక్షులు, కాంగ్రెస్‌ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ఉదయం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అనుచరులు, ఓ మైనార్టీ నాయకుడు పోచమ్మమైదాన్‌ కూడలి సమీపంలో సత్యాగ్రహ దీక్షకు సంబంధించి పనులు మొదులుపెట్టారు. ఇదే సమయంలో కొండా వర్గీయుౖలు అక్కడికి చేరుకొని దీక్షప్రదేశంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో తూర్పు కాంగ్రెస్‌లో రెండు వర్గాల అంటూ సామాజిక మాథ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

నర్సంపేట: పీసీసీ సభ్యుడు ఎస్‌.రంజిత్‌రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌ టి.రవీందర్‌రావు తదితరుల ఆధ్వర్యంలో నర్సంపేటలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నర్సంపేట మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ పి.శ్రీనివాస,్‌ పట్టణ అధ్యక్షుడు పి.రామానంద్‌ పార్టీ నాయకులు దేవేందర్‌రావు, తిరుపతి, పార్వతమ్మ, కౌన్సిలర్లు సాంబయ్య, రాజేందర్‌, విజయ్‌, అంజలి, వినోద ఆరు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


నర్సంపేటలో మాట్లాడుతున్న రంజిత్‌రెడ్డి, దీక్షలో కూర్చున్న పార్టీ శ్రేణులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని