logo

పాడి రైతులకు భాగస్వామ్యం కల్పించండి

విజయ డెయిరీ నిర్వహణలో పాడి రైతులకు భాగస్వామ్యం కల్పించాలని వరంగల్‌ విజయ డెయిరీ పాడి రైతుల సహకార సంఘం అధ్యక్షుడు ఇరుకు దేవేందర్‌రావు కోరారు. ఈ మేరకు మంగళవారం డెయిరీ పాడి

Published : 29 Jun 2022 03:17 IST

మంత్రి తలసానిని సన్మానించి వినతి పత్రం సమర్పిస్తున్న సంఘం నేతలు

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: విజయ డెయిరీ నిర్వహణలో పాడి రైతులకు భాగస్వామ్యం కల్పించాలని వరంగల్‌ విజయ డెయిరీ పాడి రైతుల సహకార సంఘం అధ్యక్షుడు ఇరుకు దేవేందర్‌రావు కోరారు. ఈ మేరకు మంగళవారం డెయిరీ పాడి రైతులతో కలిసి హైదరాబాద్‌లో రాష్ట్ర పశుసంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి వరంగల్‌ డెయిరీ పరిధిలో పాడి రైతుల సమస్యల్ని వివరించారు. ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా పాడి రైతులకు ప్రోత్సాహం అందటం లేదన్నారు. పాలసేకరణ, విక్రయాల పెంపుదలకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాడి రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న ములకనూరు డెయిరీ అధిక లాభాలు పొందుతుందన్నారు. విజయ డెయిరీ సమగ్ర అభివృద్ధికి పాడి రైతుల భాగస్వామ్యంతో విజయ కాకతీయ పాల సంఘాల సహకార యూనియన్‌ను ఏర్పాటు చేయుటకు అనుమతివ్వాలని మంత్రిని పాడి రైతులు కోరారు. లేకుంటే భవిష్యత్‌లో డెయిరీ మూసివేసే దశకు చేరుకుంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని