logo

బాలికలు భళా!

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా అశించిన ఫలితాలు సాధించలేదు. మంగళవారం విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఇరవై ఐదో స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఇరవై

Published : 29 Jun 2022 03:17 IST

న్యూస్‌టుడే, వరంగల్‌ విద్యావిభాగం: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా అశించిన ఫలితాలు సాధించలేదు. మంగళవారం విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఇరవై ఐదో స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఇరవై తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో అమ్మాయిల హవా కనిపించింది. గత రెండేళ్లు కొవిడ్‌ కారణంగా విద్యార్థులు అంతంత మాత్రమే చదువు కొనసాగింది. ఈ ఏడాది 70 శాతం సిలబస్‌తో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. కళాశాలలు ప్రారంభం నుంచే ప్రత్యేకమైన ప్రణాళికతో విద్యార్థులకు బోధన చేపట్టిన అశించిన ఫలితాలు రాలేదు. అధికారులు, అధ్యాపకులు నిరాశ చెందారు. కరోనా కారణంగా గ్రామీణ ప్రాంత నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు పూర్తిగా సన్నద్ధం కాలేదని విద్యానిపుణులు చెబుతున్నారు.

మెరిశారు...
ఖానాపురం: మండలంలోని రామలింగయ్యపల్లెకు చెందిన కోట మనుశ్రీ ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మెరిసింది. హనుమకొండలోని ఓ జూనియర్‌ కళాశాలలో చదువుతూ ఎంపీసీలో 470కి 467 మార్కులు సాధించింది. తండ్రి సురేష్‌ స్థానిక మాడల్‌ స్కూల్‌లో తెలుగు పీజీటీగా పనిచేస్తున్నారు.

చెన్నారావుపేట: స్థానిక కస్తూర్బా గురుకుల విద్యాలయం విద్యార్థిని నాంపెల్లి వెన్నెల ఎంపీహెచ్‌డబ్ల్యూ విభాగంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆ బాలిక 1000కి 964 మార్కులు సాధించింది.

వృత్తి విద్యా కళాశాలల్లో..
జిల్లాలోని రెండు ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్‌ వృత్తి విద్యా కళాశాలల నుంచి ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు 950 మంది పరీక్షలకు హాజరవ్వగా వారిలో 466 మంది (49 శాతం) ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో ఇరవై మూడో స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో 829 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 558 మంది (67 శాతం) ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో ఆరో స్థానంలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని