logo
Published : 29 Jun 2022 03:17 IST

చోరీ కేసులో ఏడాది జైలు

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: కళాశాలకు నడుచుకుంటూ వెళ్తున్న ఓ విద్యార్థిని మెడలోని బంగారు ఆభరణాన్ని తెంచుకొని వెళ్లిన మహ్మద్‌ యాకూబ్‌షరీఫ్‌కు ఏడాది కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమనా విధిస్తూ వరంగల్‌ జిల్లా మొదటి అదనపు మునిసిఫ్‌ మెజిస్ట్రేట్‌ దేవి మానస మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. 2018 ఆగస్టు 29న వరంగల్‌  ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన క్యాతం దేవిక కళాశాలకు వెళ్తుండగా మద్రాసి మసీదు వద్ద  హన్మకొండ  జవహర్‌నగర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ యాకూబ్‌షరీఫ్‌ ఆమె మెడలోని బంగారు గొలుసు ను లాక్కొని వెళ్లాడు. అప్పటి ఇంతేజార్‌ ఎస్సై కె.అశోక్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ సహాయక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వనజ వాదించారు. కోర్టు కానిస్టేబుల్‌ జి.అరుణ్‌ కుమార్‌ సాక్షులను కోర్టులో హాజరుపర్చారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts