logo

పరిశీలిస్తూ.. సూచనలు చేస్తూ..

మండలంలోని నల్లగుంట, లక్ష్మీదేవిపేట, పాలంపేట, వెంకటాపూర్‌ గ్రామాల్లో   మంగళవారం డీఎంహెచ్‌వో అప్పయ్య పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలను

Published : 29 Jun 2022 03:17 IST

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: మండలంలోని నల్లగుంట, లక్ష్మీదేవిపేట, పాలంపేట, వెంకటాపూర్‌ గ్రామాల్లో   మంగళవారం డీఎంహెచ్‌వో అప్పయ్య పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలను పరిశీలిస్తూ.. వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. స్థానిక పీహెచ్‌సీలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. విధుల్లో చురుగ్గా లేని ఓ ఆశావర్కర్‌కు నెలజీతం ఆపాలని ఆదేశించారు. వెంకటాపూర్‌, పాలంపేట ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని గుత్తేదారులను, ఇంజినీరింగ్‌ అధికారులకు సూచనలు చేశారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌, సీహెచ్‌వో సదానందం, లక్ష్మీదేవిపేట సర్పంచి గట్టు కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి రాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని