logo

పోడు రైతులపై దాడులు నిరసిస్తూ ధర్నా

పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులను నిరసిస్తూ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఏటూరునాగారం అటవీశాఖ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. పట్టాలివ్వకపోగా ఓ వైపు అటవీ

Published : 29 Jun 2022 03:17 IST

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులను నిరసిస్తూ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఏటూరునాగారం అటవీశాఖ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. పట్టాలివ్వకపోగా ఓ వైపు అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తుంటే సీఎంకు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పట్టాలు జారీ చేసి కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులు అశోక్‌, అయూబ్‌ఖాన్‌, వెంకన్న, రఘు, చిన్నఎల్లయ్య, నర్సింగరావు, ఖలీల్‌ఖాన్‌, సులేమాన్‌, గౌస్‌ పాల్గొన్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీని ఆదరించాలి
తాడ్వాయి: యావత్‌ తెలంగాణ ప్రజలు కోరుకొన్న విధంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపర్చాలని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. మండలంలోని వెంగ్లాపురం, గోనెపల్లి, నార్లాపురం, బయ్యక్కపేటలో మంగళవారం రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు అశోక్‌, సోమయ్య, వెంకన్న, అనంతరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని