logo

ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

వర్షాకాలంలో నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం

Published : 29 Jun 2022 03:17 IST

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వర్షాకాలంలో నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపీ, రాజీవ్‌గాంధీ హనుమంతు, బల్దియా కమిషనర్‌ ప్రావీణ్య పాల్గొన్నారు. నాలాలలో పూడికతీత వెంటనే చేపట్టాలని, కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలన్నారు. శిథిలావస్థ గృహాలను తొలగించాలన్నారు. 2020లో వరదలు వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్‌ రూ.510 కోట్లు నిధులు మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ.157 కోట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని