logo

ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు

ఇంటర్మీడియట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు జిల్లాకు ఆరో స్థానం దక్కింది. ప్రథమ సంవత్సరంలో ఐదో స్థానంలో నిలిచింది. ఒకేషనల్‌ కోర్సులలో విద్యార్థులు సత్తా

Published : 29 Jun 2022 03:17 IST

ప్రథమంలో 70, ద్వితీయంలో 71 శాతం ఉత్తీర్ణత

ములుగు, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు జిల్లాకు ఆరో స్థానం దక్కింది. ప్రథమ సంవత్సరంలో ఐదో స్థానంలో నిలిచింది. ఒకేషనల్‌ కోర్సులలో విద్యార్థులు సత్తా చాటారు. ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం జిల్లా రెండో స్థానంలో, ద్వితీయ సంవత్సరం మూడో స్థానంలో నిలిచింది.

సత్తా చాటిన గురుకులాలు
ములుగు: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ములుగు మండలం బండారుపల్లిలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో వంద శాతం, ప్రథమ 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. దేవిగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో ప్రథమ 73 శాతం, ద్వితీయ 90 శాతం పాసయ్యారు. జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ద్వితీయ 98 శాతం, ప్రథమ 88 
శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఏటూరునాగారం: ఏటూరునాగారం గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాల బాలికలు ఇంటర్మీడియట్‌ ఒకేషన్‌ కోర్సులో వంద శాతం ఫలితాలు సాధించారు. 42 మంది ఉండగా అంతా ఉత్తీర్ణులయ్యారు. అన్ని గ్రూపులు కలిసి ద్వితీయంలో 113 మందికి గాను 88 మంది, ప్రథమంలో 114కి 111 మంది పాసయ్యారు. గిరిజన గురుకుల బాలుర జూనియర్‌ కళాశాల ద్వితీయ 94 శాతం, ప్రథమ సంవత్సరం 95 శాతం ఉత్తీర్ణత సాధించింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు