logo

దీపం కింది నీడ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి మీద నిర్మించి, దేశ ప్రజలందరకీ చూపిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి దీపం కింద నీడలాగా మారిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు.

Published : 29 Jun 2022 03:17 IST

  దామెరకుంటలో ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న తెజస అధ్యక్షుడు కోదండరాం

కాళేశ్వరం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి మీద నిర్మించి, దేశ ప్రజలందరకీ చూపిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి దీపం కింద నీడలాగా మారిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు. మంగళవారం సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవణ్‌తో కలిసి ఆయన మహదేవపూర్‌ మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన అన్నారం, చండ్రుపల్లిలో పర్యటించారు. లక్ష్మీ బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌తో ముంపునకు గురవుతున్న రైతుల కష్టాలను అడిగితెలుసుకున్నారు. న్యాయవాది శ్రవణ్‌ మాట్లాడుతూ ముంపు విషయమై వివిధ ఫోరాలా ద్వారా జాతీయ మానవహక్కుల కమిషన్‌కు చేరిందని, దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించినట్లు చెప్పారు.

కాటారం: దామెరకుంట, లక్ష్మీపూర్‌ గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రఘుiరాం, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కామెర్ల గట్టయ్య, మాలభేరి రాష్ట్ర కన్వీనర్‌ పీˆక కిరణ్‌, యువైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని