logo

బాలికలదే హవా!!

రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంగళవారం ఒకేసారి విడుదల చేసింది. రెండో సంవత్సరం విద్యార్థులు 1,740 మంది పరీక్ష రాయగా 1,194 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో

Published : 29 Jun 2022 03:17 IST

భూపాలపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంగళవారం ఒకేసారి విడుదల చేసింది. రెండో సంవత్సరం విద్యార్థులు 1,740 మంది పరీక్ష రాయగా 1,194 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 681 మందికి 311, బాలికలు 1,069 మందికి 983 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఉత్తీర్ణత శాతం 68గా నమోదైంది. బాలురుల కంటే బాలికలే సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో 1,998 మందికి 1,045 మంది పాస్‌ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 51 శాతం నమోదైంది. ఇందులో బాలురు 848 మందికి గానూ 290, బాలికలు 1,150 మంది పరీక్ష రాయగా 755 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కూడా బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణులైయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఐదు ఉండగా తాడిచర్ల జూనియర్‌ కళాశాలలో 73, భూపాలపల్లిలో 65, మహదేవపూర్‌లో 69, చిట్యాలలో 75, కాటారంలో 62 ఉత్తీర్ణత శాతం నమోదైంది.


మెరిసిన శ్రీజ
భూపాలపల్లి, న్యూస్‌టుడే: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వనపాకల శ్రీజ 440కి 437 మార్కులు సాధించారు. భూపాలపల్లి పట్టణంలోని కారల్‌మార్క్స్‌కాలనీలో నివాసముంటున్న తండ్రి రామ్మూర్తి సింగరేణిలో ఒప్పంద కార్మికుడు. తల్లి కళ్యాణి గృహిణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని