logo

రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయంటూ ‘ఈనాడు’లో ‘రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలు’ అనే శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లా అధికారి రోజారాణి జనగామ...

Published : 29 Jun 2022 03:17 IST

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయంటూ ‘ఈనాడు’లో ‘రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలు’ అనే శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లా అధికారి రోజారాణి జనగామ, బచ్చన్నపేట తదితర మండలాల్లో మంగళవారం రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. డీలర్ల వద్ద పంపిణీ అయిన బియ్యం, నిల్వ ఉన్న వివరాలను తనిఖీ చేశారు. రోజారాణి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని