logo

ఉర్సు ఆసుపత్రిలో ఇక ప్రసూతి సేవలు

వరంగల్‌ సీకేఎం ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఉర్సు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇక నుంచి ఓపీ వైద్యసేవలతో పాటు ప్రసూతి సేవలు అందనున్నాయి. వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది నియామకంతోపాటు

Published : 30 Jun 2022 05:52 IST

కరీమాబాద్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ సీకేఎం ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఉర్సు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇక నుంచి ఓపీ వైద్యసేవలతో పాటు ప్రసూతి సేవలు అందనున్నాయి. వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది నియామకంతోపాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు సీకేఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్‌ నిర్మలకుమారి తెలిపారు. 2017 నుంచి కేవలం ఓపీ సేవలను మాత్రమే అందిస్తున్న ఆసుపత్రిలో ప్రసూతి సేవలను కొనసాగించాలని కలెక్టర్‌ బి.గోపి ఆదేశించిన నేపథ్యంలో తమ ఆసుపత్రి నుంచి వైద్యులు, నర్సులు, థియేటర్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, ఫార్మసిస్టు తదితర అన్ని రకాల సిబ్బందిని ఉర్సు ఆసుపత్రిలో ఇకపై 24గంటలు సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి సాధారణ ప్రసూతి సేవలు అందిస్తామని, ప్రసూతి మహిళల నుంచి వచ్చే స్పందనను బట్టి అత్యవసరమైతే శస్త్రచికిత్సద్వారా ప్రసవాలు కూడా చేస్తామన్నారు. అండర్‌ రైల్వేగేటు ప్రాంతంలోని ప్రసూతి, గైనిక్‌ సమస్యలతో ఉన్నవారు ఇకపై ఉర్సు ఆసుపత్రిలో సేవలను పొందాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని