logo

ముత్యంలా ధార.. జాలువారిన తార

దట్టమైన అడవిలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండలపై నుంచి పాలనురుగులా ఎగిసిపడుతున్న అందాలు సందర్శకులను అలరిస్తున్నాయి.

Published : 30 Jun 2022 06:14 IST


దుసపాటిలొద్దిలో పర్యాటకులు

వాజేడు, వెంకటాపురం, న్యూస్‌టుడే: దట్టమైన అడవిలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండలపై నుంచి పాలనురుగులా ఎగిసిపడుతున్న అందాలు సందర్శకులను అలరిస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల సమీపంలోని దుసపాటిలొద్ది జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. అదేవిధంగా వెంకటాపురం మండలం వీరభద్రవరం సమీప అభయారణ్యంలో ముత్యం జలధార జాలువారుతోంది. పచ్చని అడవిలో అందాలను సందర్శకులు తిలకిస్తున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎత్తైన కొండ నుంచి పాలనురగలా వరద ఉప్పొంగి కిందకు దుముకుతోంది. నిషిద్ధ అటవీ ప్రాంతం కావడం, మార్గం సైతం అనుకూలంగా లేకపోవడంతో స్వల్పంగానే పర్యాటకులు సందర్శిస్తున్నారు.


జాలువారుతున్న ముత్యం జలధార

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని