logo

రామోజీ ఫిల్మ్‌సిటీలో విద్యార్థుల విహారం

ప్రకృతి అందాల నెలవు.. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం విద్యార్థులు సందడి చేశారు. కొవిడ్‌ నుంచి ప్రపంచం కోలుకొని ఈ ఏడాది పూర్తి స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్న నేపధ్యంలో

Published : 01 Jul 2022 01:55 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే : ప్రకృతి అందాల నెలవు.. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం విద్యార్థులు సందడి చేశారు. కొవిడ్‌ నుంచి ప్రపంచం కోలుకొని ఈ ఏడాది పూర్తి స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్న నేపధ్యంలో వీరంతా బడిబాట పట్టారు. ఈ క్రమంలో నిత్యం పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు ఆట విడుపుగా విహార యాత్రలకు తరలివస్తుంటారు. ఎన్నో విశేషాలకు నిలయమైన రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచి వీరంతా తరలివస్తుండటంతో ఫిల్మ్‌సిటీలో సందడి వాతావరణం నెలకొంటోంది. హైస్కూల్‌ విద్యార్థులు సాహస కృత్యాల నెలవు సాహస్‌లో ఉత్సాహంగా గడుపుతున్నారు. పిల్లలను ఆకట్టుకొనే అన్నదాత ఆగ్రో టూర్‌ విశేషాలు, ఫండుస్థాన్‌, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే స్టంట్‌ షో, సీతాకోక చిలుకల పార్కు, కిలకిలారావాల పక్షుల పార్కు సందర్శనతో అనుక్షణం ఆనందవీక్షణాలను ఆస్వాదిస్తున్నారు. వీరికి విహారంతో పాటు వినోదం పంచేందుకు పాఠశాలల నిర్వాహకులు రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనను ఎంచుకుంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీలలో అనుమతిస్తుండటంతో పలు విద్యా సంస్థలు తమ విద్యార్థులను ఫిల్మ్‌సిటీకి తీసుకువస్తున్నారు. మీరు మీ పాఠశాల, కళాశాల విద్యార్థులను రామోజీ ఫిల్మ్‌సిటీ విహారానికి తీసుకురావాలనుకుంటే ఇదే మంచి అవకాశం.


వివరాలకు..
అనువైన ప్యాకేజీలు తదితర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌: 93930 93930

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని