logo

పదిలో బాలికలదే పైచేయి

జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. ఉత్తీర్ణత శాతంలో జిల్లా రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో నిలిచింది. జిల్లాలో 318 పాఠశాలలకు చెందిన 12,454 మంది విద్యార్థులు పరీక్ష రాయగా

Published : 01 Jul 2022 01:55 IST

రాష్ట్రస్థాయిలో జిల్లాకు ఆరోస్థానం

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. ఉత్తీర్ణత శాతంలో జిల్లా రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో నిలిచింది. జిల్లాలో 318 పాఠశాలలకు చెందిన 12,454 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,965 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 5,712, బాలురు 6,253 మంది ఉన్నారు. 15 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 159 మంది విద్యార్థులు పది జీపీఏ పొందారు. 55 ప్రభుత్వ పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి.  

జిల్లా వ్యాప్తంగా 9 కేజీబీవీలు ఉన్నాయి. అందులో 300 మంది పరీక్షలకు హాజరుకాగా 289 మంది (96.33 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆత్మకూర్‌, ఐనవోలు, శాయంపేట, వేలేరు కేజీబీవీలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.

యాజమన్యాల వారీగా ..
ఎయిడెడ్‌ పాఠశాలల్లో 98.77 శాతం, ఆశ్రమలో 78.13, బీసీ సంక్షేమలో 100, ప్రభుత్వ పాఠశాలల్లో 86.07, ప్రైవేటులో 98.04, ఆదర్శ పాఠశాలల్లో 97.99, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 99.56, రెసిడెన్షియల్‌ (మైనార్టీ)లో 97.33, సోషల్‌ వేల్ఫేర్‌లో 99.37, ట్రైబల్‌ వేల్ఫేర్‌లో 98.78, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 90.95 శాతం ఉత్తీర్ణత సాధించారు.


ఉత్తమ ఫలితాలు సాధించాం
- బి.రంగయ్యనాయుడు, డీఈవో

పదో తరగతి ఫలితాల్లో ప్రత్యేక ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించాం.  పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారికి ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది.. విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించి పరీక్షలకు సన్నద్ధం కావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు