logo

కపాలినీగా శ్రీ భద్రకాళి

శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు కపాలినీగా, భగమాలినీగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, నవరాత్ర పూజలు నిర్వహించారు.

Updated : 02 Jul 2022 07:24 IST

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు కపాలినీగా, భగమాలినీగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, నవరాత్ర పూజలు నిర్వహించారు. కాళీ క్రమాన్ననుసరించి ఆరు మూర్తులలో ఇచ్ఛాశక్తిమయమైన ఉత్సవమూర్తిని కపాలినీగా, షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిమయమూర్తిని భగమాలినీగా అలంకరించి పూజలు, అర్చనలు జరిపారు. అమ్మవారు రాక్షసులను సంహరించి వారి కపాలములను మాలగా ధరిస్తుందని, అందుకే శాస్త్రాలు అమ్మవారిని కపాలినీ అని కీర్తిస్తారని ప్రధానార్చకుడు వివరించారు. శుక్రవారం కావడంతో ఆలయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తుల రద్దీ నెలకొంది. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ‘కుడా’ ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

రంగంపేట, న్యూస్‌టుడే: ఓరుగల్లు నగరంలో చారిత్రక శ్రీభద్రకాళి అమ్మవారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ దర్శించుకున్నారు. న్యాయమూర్తికి ఈవో శేషుభారతి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో శాకాంబరీ మహోత్సవాల విశేషాలను న్యాయమూర్తికి వివరించారు. మహా మండపంలో ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని