logo

విజ్ఞానశాస్త్ర ప్రచారంలో పత్రికలదే ప్రధాన పాత్ర

విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర వహించాలని వరంగల్‌ ఎన్‌ఐటీ సంచాలకులు ఆచార్య ఎన్‌వీ.రమణ పిలుపునిచ్చారు. కేంద్రం శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఎన్‌ఐటీ సైన్స్‌ కమ్యూనికేషన్‌,

Updated : 02 Jul 2022 07:24 IST

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న సంచాలకులు ఆచార్య ఎన్‌వీ.రమణ,

వేదికపై ఆచార్య రామచంద్రయ్య, రిజిస్ట్రార్‌

గోవర్ధన్‌రావు, సైన్స్‌ కాలమిస్టు వేణుగోపాల్‌

కాజీపేట, న్యూస్‌టుడే: విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర వహించాలని వరంగల్‌ ఎన్‌ఐటీ సంచాలకులు ఆచార్య ఎన్‌వీ.రమణ పిలుపునిచ్చారు. కేంద్రం శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఎన్‌ఐటీ సైన్స్‌ కమ్యూనికేషన్‌, పాపులరైజేషన్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌(స్కోప్‌) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘విజ్ఞానశాస్త్ర ప్రచారం, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ సమాచారం మాధ్యమాల పాత్ర’ అనే అంశంపై ఎన్‌ఐటీలో పాత్రికేయులకు ఒకరోజు అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. స్కోప్‌ సమన్వయకర్త ఆచార్య రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంచాలకులు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పరిశోధనలతో శాస్త్రీయంగా రుజువు చేసిన విజ్ఞానాన్ని ప్రజలకు చేర్చడానికి పాత్రికేయులు ప్రముఖ పాత్ర వహించాలని కోరారు. రిజిస్ట్రారు ఎస్‌.గోవర్ధన్‌రావు మాట్లాడుతూ.. రాజకీయం, సినిమాల ప్రచారం ఎక్కువగా సాగుతోందని సైన్స్‌ మ్యాగజైన్‌లు, ప్రచార మాధ్యమాలు ఎక్కువగా రావాలని సూచించారు. పోఖ్రాన్‌ అణు పరీక్షల తర్వాత ప్రజలు అది కేవలం అణుబాంబుగానే చూశారని, దాని ద్వారా ఉద్భవించే విద్యుత్తు, ఇంకా అనేక రకాల ప్రయోజనాలున్నాయని ప్రజలు గ్రహించలేక పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త అణు ప్రాజెక్టుల ప్రయోజనాలపై అవగాహన లేక వాటిని రాజకీయం చేసి గుడ్డిగా విమర్శించడం తగదని సూచించారు. సైన్స్‌ కాలమిస్టు డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ తెలుగుపత్రికలు, తెలుగు సాహిత్యం, రేడియో, టెలివిజన్‌ తదితర మాధ్యమాల్లో సైన్స్‌ రచనలు, సీనియర్‌ జర్నలిస్టు గోపాలకృష్ణ తెలుగు వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా సైన్స్‌ ప్రచార అవకాశాల అంశాలపై ప్రసంగించారు. రామచంద్రయ్య మాట్లాడుతూ.. స్కోప్‌ ద్వారా విజ్ఞాన్‌ ప్రసార్‌ అనే పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు