logo
Published : 06 Aug 2022 03:01 IST

ప్రకటించని లాభాలు.. నిరాశలో కార్మికులు

న్యూస్‌టుడే, కోల్‌బెల్ట్‌

సింగరేణి.. భూగర్భంలోని బొగ్గును వెలికి తీస్తోంది.. దేశానికి వెలుగులు పంచుతోంది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా లాభాల్లో వాటా చెల్లిస్తూ ఉద్యోగుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు మాసాలు గడుస్తున్నా 2021-22కి సంబంధించిన వాస్తవ లాభాలను యాజమాన్యం ప్రకటించలేదు. దీంతో కార్మిక వర్గం తీవ్ర నిరాశలో ఉంది. వాట ఎప్పుడిస్తుందో అని నిరీక్షిస్తున్నారు.
సింగరేణి కంపెనీలో లాభాలు ప్రకటించడం ప్రతిసారీ జాప్యమవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ ఆలస్యం చేస్తూనే ఉంది. ప్రతినెల సంస్థ టర్నోవర్‌, లాభాలు సాధించిన వృద్ధి తదితర విషయాలను ఎప్పటికప్పుడూ ప్రకటిస్తూ వస్తున్న అధికారులు వార్షిక లాభాలను వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీ నిధులను ప్రభుత్వం ఇష్టానుసారంగా వినియోగించకుంటుందని, అందుకే ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

అసహనంలో నాయకులు

కరోనా ప్రభావంతో 2021-22లో తక్కువ లాభాల వాటా అందుకున్న కార్మికులు ఈసారి ఎక్కువ మొత్తం వస్తుందనే ఆశతో ఉన్నారు. ఇటీవల గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సింగరేణి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. లాభాల విషయమై మాట్లాడకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆడిటింగ్‌ పనులు పూర్తి చేసి ఇప్పటికైనా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు కార్మికులు 2018-19లో అత్యధికంగా రూ.479కోట్ల లాభాల్లో వాటా పొందగా, కరోనా ప్రభావంతో గత ఏడాది వాటా 29శాతం పెరిగినా రూ.78.88 కోట్లు మాత్రమే పొందారు.

* సింగరేణి లాభాలు ప్రకటించిన తర్వాత గుర్తింపు సంఘం నాయకులు ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతారు. కార్మికులకు చెల్లించే వాటాపై ప్రకటన చేయిస్తారు. ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.


35 శాతం చెల్లించాలి

జోగ బుచ్చయ్య, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు

సింగరేణి సంస్థ పొందిన లాభాల నుంచి కార్మికుల వాటా 35శాతం చెల్లించాలి. ఆర్థిక సంత్సరం ముగిసిన వెంటనే వెల్లడించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. నెలల తరబడి ఆసల్యం చేయడం తగదు. సాంకేతిక పరిజ్ఞానంలో చాలా ముందుకుపోతున్నాం. అయినా లెక్కల పేరుతో జాప్యం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలి.  


జాప్యం చేస్తే ఆందోళనలు

కంపేటి రాజయ్య, సీఐటీయూ కార్యదర్శి

గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాలు ఎంతో సింగరేణి ప్రకటించాలి. నాలుగు మాసాలుగా కార్మికులు తమ వాటా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే చొరవచూపాలి. లేకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని