logo

వైద్యుల పని వార్డుబాయ్‌లు చేస్తే కఠిన చర్యలు

అత్యవసర రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించడానికి క్యాజువాలిటీని మార్చాలని  డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, ఇతర అధికారులతో కలిసి అకస్మిక తనిఖీలు చేశారు.

Updated : 07 Aug 2022 05:48 IST

 ఎంజీఎం అకస్మిక తనిఖీలో డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి

ఎంజీఎం ఓపీˆ వైద్యవిభాగంపై సూపరింటెండెంటు డాక్టర్‌ చంద్రశేఖర్‌కు సూచనలు చేస్తున్న డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: అత్యవసర రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించడానికి క్యాజువాలిటీని మార్చాలని  డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, ఇతర అధికారులతో కలిసి అకస్మిక తనిఖీలు చేశారు. వివిధ విభాగాలను పరిశీలించారు. క్యాజువాలిటీలో ఇటీవల వైద్యులు చేయాల్సిన పనిని వార్డు బాయ్‌లు చేతుల్లోకి తీసుకొని రోగిని డబ్బులు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఇకపై వైద్యులు మాత్రమే ఆ పనిచేయాలని, వార్డుబాయ్‌లు కుట్లు వేసే పనులు చేసినట్లు తెలిస్తే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వైద్యులు అందరూ రాత్రి విధులు సక్రమంగా నిర్వహించాలని, రాత్రివేళ వారికి మెరుగైన పోషకాహారం అందించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఎంజీఎంలో ఉన్న క్యాజువాలిటీలో ఒకేసారి వందమంది వస్తే సేవలందించడానికి ఇరుకుగా ఉందని, దాన్ని కొత్త కార్డియాలజీ భవనంలోకి మార్చాలని సూపరింటెండెంటు డాక్టర్‌ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. దీంతో సుమారు 30 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని,  కొత్త సీటీ స్కానింగ్‌ ఉండటం వల్ల రోగులకు అత్యవసర సేవలు అందుతాయన్నారు.  వచ్చే మూడునెలల్లో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మందుల సరఫరాకు టీఎస్‌ఎంఐడీసీˆ టెండర్లు పూర్తిచేసిందని త్వరలోనే అన్నిరకాల మందులు, సర్జికల్‌ వస్తువులు అందుబాటులోకి వస్తాయన్నారు.  ఆసుపత్రిలో హెడ్‌ నర్సులకు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించేలా రోస్టర్‌ అమలు చేయాలని డీఎంఈ ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌ఎంవోలు డాక్టర్‌ మురళి, డాక్టర్‌ దిలీప్‌, ఇతర వైద్యాధికారులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని