logo

అనువుగాని చోట క్రీడా ప్రాంగణం!

చేపల చెరువు కాదు.. దంతాలపల్లిలోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణమిది. స్థానిక పెద్ద చెరువు సమీపంలోనే సుమారు ఎకరం విస్తీర్ణంలో మట్టిపోసి చదును చేసి నెలకొల్పారు.

Published : 08 Aug 2022 05:26 IST

చేపల చెరువు కాదు.. దంతాలపల్లిలోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణమిది. స్థానిక పెద్ద చెరువు సమీపంలోనే సుమారు ఎకరం విస్తీర్ణంలో మట్టిపోసి చదును చేసి నెలకొల్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరదనీరంతా ఈ మైదానం మీదుగా చెరువులోకి వెళ్లింది. దీంతో ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది. వరదనీరు నిల్వ ఉండే ఇలాంటి ప్రదేశాల్లో ముందు చూపులేకుండా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ సొమ్మును వృథా చేశారంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. నీట మునిగిన ప్రాంగణంలో ఆటలు ఎలా? అని అధికారులు, పాలకులను ప్రశ్నిస్తున్నారు.

- న్యూస్‌టుడే, దంతాలపల్లి (మరిపెడ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని