logo

ఉప్పొంగిన బొగత.. ఆంక్షలతో సందర్శన

మండలంలో ఏకధాటిగా కురుస్తున్న భారీవర్షాలతో బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. పర్యాటకులు నిలబడే రాతికట్టపై నుంచి వరదనీటి ప్రవాహం వెళ్తుండడంతో రక్షణ సిబ్బంది పర్యాటకులను ఆప్రాంతానికి అనుమతించలేదు.

Published : 08 Aug 2022 05:26 IST


రాతికట్టపై నుంచి జలపాతాన్ని వీక్షిస్తున్న పర్యాటకులు

వాజేడు, న్యూస్‌టుడే: మండలంలో ఏకధాటిగా కురుస్తున్న భారీవర్షాలతో బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. పర్యాటకులు నిలబడే రాతికట్టపై నుంచి వరదనీటి ప్రవాహం వెళ్తుండడంతో రక్షణ సిబ్బంది పర్యాటకులను ఆప్రాంతానికి అనుమతించలేదు. పగోడా చుట్టూ వరదనీరు చేరింది. వరదనీటిలోకి సందర్శకులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు రక్షణ సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. తాడు కట్టి అడ్డంగా నిలబడి కాపలా కాయాల్సివచ్చింది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సమాచారం తెలిసినా అటవీశాఖ అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. సెలవు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. పగోడా సమీపంలోని రాతికట్ట వరకు మాత్రమే వారిని అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని