logo

వాన హోరు..అథ్లెట్ల జోరు..

తొలి జాతీయ జావెలిన్‌త్రో డే వేడుకలను అథ్లెట్లు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో వరంగల్‌, హనుమకొండ అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు జరిగాయి.

Published : 08 Aug 2022 05:38 IST

న్యూస్‌టుడే, వరంగల్‌ క్రీడావిభాగం

తొలి జాతీయ జావెలిన్‌త్రో డే వేడుకలను అథ్లెట్లు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో వరంగల్‌, హనుమకొండ అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు మూడు వందల మంది అథ్లెట్లు హుషారుగా పాల్గొన్నారు.  అండర్‌-14, 16, 18, 20లో బాలబాలికలు, మహిళ, పురుషులు విభాగాల్లో అథ్లెట్లు బరిలోకి దిగారు. ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ జావెలిన్‌ విసిరి పోటీలను ప్రారంభించారు. జావెలిన్‌త్రో డే పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేశారు.  కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ నీరజ్‌చోప్రా ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించి ఆదివారంతో సంవత్సరం అయిందని, ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు తొలిసారిగా ఈ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఒక పక్క వర్షం కురుస్తున్నప్పటికీ క్రీడాకారులు విజయమే లక్ష్యంగా  పోటీపడ్డారు. విజేతలకు సంఘం ప్రతినిధులు వ్యక్తిగత మెడల్స్‌, ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో కుడా ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌, అధ్యక్షులు వరదరాజేశ్వరరావు, కోచ్‌లు నాగరాజు, శ్రీమన్నారాయణ, వాసు, కృష్ణ, మహేందర్‌, వివిధ జిల్లాల అథ్లెట్లు పాల్గొన్నారు.


జావెలిన్‌ విసురుతున్న వినయ్‌భాస్కర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని