logo

స్వేచ్ఛా వనాలు సిద్ధం

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడి ఆదేశానుసారం  బాలసముద్రం,  తిమ్మాపూర్‌ గ్రామంలో రెండు స్వేచ్ఛా వనాలు(ఫ్రీడం పార్కులు) సిద్ధం చేశారు.

Updated : 10 Aug 2022 04:39 IST

కార్పొరేషన్‌: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడి ఆదేశానుసారం బాలసముద్రం,  తిమ్మాపూర్‌ గ్రామంలో రెండు స్వేచ్ఛా వనాలు(ఫ్రీడం పార్కులు) సిద్ధం చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే వీటిని అందుబాటులోకి తెచ్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ లోగో కోసం వివిధ రకాలైన ఆకర్షణీయమైన మొక్కలు నాటారు. మంగళవారం ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో బుధవారం ప్రారంభించాలనుకున్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు