logo

ఎమ్మెల్యేకు సవాల్‌ విసురుతూ గోడపత్రికలు

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు సవాల్‌ విసురుతూ వరంగల్‌ అండర్‌బ్రిడ్జి, రైల్వే, కాశీబుగ్గ ప్రాంతాల్లో గోడపత్రికలు వెలిశాయి.

Updated : 10 Aug 2022 06:25 IST

శివనగర్‌, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు సవాల్‌ విసురుతూ వరంగల్‌ అండర్‌బ్రిడ్జి, రైల్వే, కాశీబుగ్గ ప్రాంతాల్లో గోడపత్రికలు వెలిశాయి. ఇటీవల  నరేందర్‌ తన జన్మదినం సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై పరోక్షంగా పరుష పదజాలంతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10 లోగా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని, ఓరుగల్లు బిడ్డవైతే సవాల్‌ స్వీకరించాలని ప్రదీప్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన వర్గం అదే అంశాన్ని ఇలా ఈ పత్రికలగా ముద్రించి నగరంలో ఆయా ప్రాంతాల్లో అతికించడం కలకలం రేపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని