logo

ఎదురొచ్చిన కార్లు.. వెనక్కు తగ్గని వైరి వర్గాలు!

ఖిలావరంగల్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు కార్లు ఎదురుపడటం కొద్దిసేపు ఉత్కంఠకు దారితీసింది.

Updated : 10 Aug 2022 15:41 IST


కొండా మురళి వాహనం ఎమ్మెల్యే నరేందర్‌ కారు

న్యూస్‌టుడే, ఖిలావరంగల్‌: ఖిలావరంగల్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు కార్లు ఎదురుపడటం కొద్దిసేపు ఉత్కంఠకు దారితీసింది. మంగళవారం మొహర్రం సందర్భంగా మధ్యకోటలోని అషూర్‌ఖానాలో మురళీధర్‌రావు తమ నాయకులు, కార్యకర్తలతో పీరీలను దర్శించుకొని కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నరేందర్‌ వాహనం ఎదురుగా వచ్చింది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో రెండు వాహనాలు ఎదురెదురుగా నిలిచిపోయాయి. పోలీసులు మురళీధర్‌రావు వాహనం వెనెక్కి వెళ్లాలని చెప్పగా ఎదురుగా వచ్చిన వాహనమే తీయాలని తాము వెనక్కి తీయమని నిలిపారు. రెండు వర్గాల అనుచరులు తమ నాయకుడికి జై కొడుతూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చేసేదేమీలేక పోలీసులు ఇరుపక్కల ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసి రెండు కార్లను పంపించి ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని