logo

కాంగ్రెస్‌ను వీడేది లేదన్న కొండా

కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదని, వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ పోటీ చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు.

Published : 10 Aug 2022 04:21 IST


ముఖ్యకార్యకర్తలతో సమావేశమైన మురళి

రంగంపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదని, వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ పోటీ చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. మంగళవారం హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో తూర్పు కాంగ్రెస్‌ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆజాదీ కా అమృత్సోవాల్లో భాగంగా ఈ నెల 14న  జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నిర్వహించనున్న పాదయాత్ర తూర్పులో వాయిదా వేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో కలిసి  నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని, డివిజన్లలో సురేఖ పాదయాత్రలు ఉంటాయని  మురళి వెల్లడించారు. భాజపాలో చేరనున్నట్లుగా గత కొన్ని రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌లోనే ఉంటామని కార్యకర్తలకు తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశిస్తే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై పాలకుర్తిలో పోటీకి సిద్ధమన్నారు. సొంత తమ్ముడు ప్రదీప్‌రావుకు న్యాయం చేయని ఎర్రబెల్లి తక్షణం రాజీనామా చేయాలని మురళీ డిమాండ్‌ చేశారు. దయాకర్‌రావు తెరాస, అల్లుడు కాంగ్రెస్‌, సోదరుడు రేపో మాపో భాజపాలో చేరతారని, ఒకే ఇంట్లో మూడు పార్టీలని ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మీసాల ప్రకాష్‌, నల్గొండ రమేష్‌, కరాటే ప్రభాకర్‌, ఎండీ.అక్తర్‌, మంతెన సునీత, కొత్తపెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని