logo

జాతీయ సమైక్యతను వెలుగెత్తి చాటాలి

జాతీయ సమైక్యత భావాన్ని ప్రతి ఒక్కరిలో నిలిపేందుకు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

Updated : 10 Aug 2022 04:42 IST


అధికారులతో సమావేశమైన మంత్రి దయాకర్‌రావు, చిత్రంలో ఎమ్మెల్యేలు
ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య, తదితరులు

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జాతీయ సమైక్యత భావాన్ని ప్రతి ఒక్కరిలో నిలిపేందుకు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాలను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతీయతను ప్రతి ఒక్కరి మదిలో ఇమిడింపజేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా రూపకల్పన చేసిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు విభిన్న కార్యక్రమాలు రూపొందించినందున ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉండాలన్నారు. ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగరేసి జాతీయ సమైక్యతను చాటాలన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు పంపిణీ చేయనున్నామని, అర్హులై పింఛన్లు రానివారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు అందిస్తే మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య మాట్లాడుతూ. వజ్రోత్సవాలను సమన్వయంతో చేపడతామని, గ్రామస్థాయిలో సమైక్యత భావాన్ని ప్రతి ఒక్కరిలో నిలిపేందుకు అంకితభావంతో కృషిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, పురపాలిక ఛైర్‌పర్సన్‌ పోకల జమున, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్‌ హమీద్‌, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీవో రాంరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సర్వమత సౌభ్రాతృత్వ భారతావని గర్వకారణం
కొడకండ్ల: భారతదేశం సర్వమత సౌభాతృత్వంతో ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిచి అన్ని దేశాల అభిమానం చూరగొనడం ఈ దేశ పౌరులుగా మనందరికీ గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కొడకండ్లలో మంగళవారం జరిగిన బోనాల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి ముత్యాలమ్మకు, కాలభైరవునికి పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. అనంతరం గ్రామం నడిబొడ్డున జరుగుతున్న మొహర్రం కార్యక్రమంలో పాల్గొని పీరీ ఎత్తుకొని ఆశీర్వాదం అందుకొన్నారు. డీసీసీబీ వైస్‌ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ సభ్యురాలు సత్తెమ్మ, ఎంపీటీసీ సభ్యులు విజయలక్ష్మి, యాకయ్య, సర్పంచి మధుసూదన్‌, తెరాస మండల అధ్యక్షుడు సింధె రామోజీ, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.


పీరీ ఎత్తిన మంత్రి దయాకర్‌రావు

చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి
జనగామ: సాంతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ చలన చిత్ర ప్రదర్శనను జనగామలో ప్రారంభించారు. స్థానిక దేవి థియేటర్‌లో మంగళవారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విచ్చేశారు. కలెక్టర్‌ శివలింగయ్య, జడ్పీఛైర్మన్‌ సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ రాజయ్యలతో కలిసి ప్రదర్శన ప్రారంభించి చిత్రాన్ని కొద్దిసేపు వీక్షించారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts