logo

మహనీయులను స్మరించుకోవాలి

భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌ సమీపంలోని ఇల్లందు క్లబ్‌హౌస్‌లో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఆయన ప్రారంభించారు.

Published : 10 Aug 2022 04:27 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, పక్కన అదనపు కలెక్టర్‌ తదితరులు

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌ సమీపంలోని ఇల్లందు క్లబ్‌హౌస్‌లో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఆయన ప్రారంభించారు. జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించగా 20 లక్షల మంది పిల్లలు వీక్షించారని, ఇది ప్రపంచ రికార్డని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈనె 22 వరకు వజ్రోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. జిల్లాకు వచ్చిన 50 వేల జాతీయ జెండాలను మున్సిపాలిటీ, పంచాయతీల పరిధిలో పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దివాకర, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వెంకటరాణి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం
భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వజ్రోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు. వేడుకల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై ఆయన హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్‌తో వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ బుధవారం ఫ్రీడం పార్కు కింద ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో 75 మొక్కలు నాటాలన్నారు. 11న ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు మండలకేంద్రాల్లో ఫ్రీడం రన్‌ నిర్వహించాలని, స్థానిక పోలీసులు చురుకుగా వ్యవహరించాలన్నారు. విద్యార్థులు, కళాకారులు, సిబ్బందిని సమన్వయం చేయాలన్నారు. 16న సామూహిక గీతాలపన కోసం పట్టణం, గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, విద్యా, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల్లో గీతాలపన జరగాలన్నారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన నివేదకను  పంపాలన్నారు. కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఎస్పీ సురేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ దివాకర, జిల్లా అటవీశాఖ అధికారి లావణ్య, డీపీవో ఆశాలత, డీఎంహెచ్‌వో శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని